తే. పచ్చని పటము గట్టిన పడుచు వోలె
కురుల మల్లెలు తురిమిన కొమ్మ వోలె.
చెలువు మీర అళి చెలులు బలసి గొలువ
వచ్చె పుడమికి నూత్న వసంత లక్ష్మి
కం. డెందము నందు జనులకా
నందము నింపగ పుడమికి మన్మథుడొచ్చెన్
నందక ధారి కృపారస
మందಱకున్ దొరకుగాత వత్సర మంతన్
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
మన్మథ నామ సంవత్సరానికి విన్నపం.
_____________________________
మన్మథ మన్మథస్వాగతం నీకు
నిరుడు జయ నామ సంవత్సరం వచ్చింది
నిలువునా రాష్ట్రాన్ని రెండు గా చీల్చింది
ప్రజలకు ద్రవ్య లోటు, నీళ్ళ పాట్లు మిగిల్చింది
హుద్ హుద్ ఉత్పాతం రాష్ట్రా నికి శాపమయ్యె
మూలుగుతున్న నక్క పై తాటి కాయ చందమయ్యె
అరచేతిలో వైకుంఠం చూపించె నాయకులు
చిలక జ్యోస్యులను తలపిస్తున్నారు
నల్ల కుబేరులఘనత చూసి
నల్ల కోయిల తెల్ల బోయింది
ఇక ఇసుక మాఫియా రాయల్లు
కాదేది మేత కనర్హం అన్నట్లు
సర్వ భక్షకున్ని తలదన్నారు
ఈ కష్టాలన్ని గట్టెక్కి. ఆంధ్రప్రదేశ్
స్వర్ణాంధ్ర వైపు పరుగులు తీసేదెప్పుడు
సగటు ఆంధ్రుడి కష్టాలుతీరెదెప్పుడు
మన్మథా నీవైన మా మొరాలకించి
చెట్లను చిగిరింపజేసి ఫలభరితం జేసె మన్మథ
మాజీవితాలు సుఖ భరితం చేయవయ్యా
తుమ్మెదలకు మకరందాన్ని అందించే నువ్వు
చిలుకలచే కేరింతలు పెట్టించె నువ్వు
గ్రీష్మతాపాన్ని తగ్గించి మలయ పవనాలు వీయించి
మాకు ఆనందాన్ని అందించవయ్యా
ఇదేనా విన్నపం