6, ఏప్రిల్ 2013, శనివారం


రక్తదానం


ఆ.వె  అదొక పాఠశాల అందొక ఒజ్జ బో
        ధనము చేయు చుండె రక్త దాన 
        గరిమ బాలబాలికలకు విశదముగ
        చెవులకు మనసులకు యింపు గొలుప
  

తే.గీ.   ఆకలికి కొంత తడవైన తాళవచ్చు
          చూపు  లేకున్న  తడవుచు పోవ వచ్చు
          రోగమొచ్చిన బాధ కు నోర్వ వచ్చు
          బహుళ రక్తస్రవణమైన  బతుక తరమె

కం.    ఆకొన నన్నము నొసగుట
        చీకునకున్   చేయిదోడునిచ్చుట వింతౌ
        నే?కాదు క్షతగాత్రుకు(
        మీకాయమునుండి నెత్తు రిచ్చుటమేలౌ

కం.దానమునొసగిన నెత్తురు
     దానంతన వచ్చి చేరు  నారికడము లో
     పానీయముకరణి ,చెలమ
     లోని జలము వోలె మీరు సుఖముగనుండన్