హనుమంతుని జయంతి సందర్భముగ హనుమత్సుతి
సీ పసితనమ్మున నొక్క ఫలమంచు భ్రమపడి
భానునికబళించు బాహుబలుఁడు
పురచరశాఖాగ్ర చరులకు మైత్రి ని
బంధించ గల నీతిపారగుండు
లంఘించి అంబోధి లంకినిన్భంజించి
ఉర్విజ న్గన్గొన్న యుత్తముండు
మేఘనాథుని చేత మృత్యువాతను బడ్డ
వారిని బ్రతికించు ప్రాణదాత
తే.గీ. రామసుగ్రీవమిత్ర సంరక్షకుండు
రావణ గర్వాపహరణ విరాజితుండు
రామనామ నిరంతరారాధకుండు
నైన మారుతి నెప్పుడు నామతింతు .