స్నేహితుల దినోత్సవము సందర్భముగా స్నేహము గురించి
సీ.
ఏ చెల్మినా శించి ఇంద్రుడు కాతర తక్షకు ప్రేమతో రక్ష సేసె /
ఏ నెయ్యమర్కజుఁ డెంచి యవనిజాత నరయించి చెలికాని యార్తి బాపె /
ఏ కూర్మిచే శౌరి యాకుచేలుని కౌగిలిపరవశించెనో లేమితొలఁ గ /
ఏ నెయ్యమును కోరి కానీను కౌరవుండంగదేశమునకు నధిపుఁ జేసె //
తే గీ. నట్టి చెలిమికి లేవులే యెట్టి జాతి /
భేదములు ఖేదమోదాదిభిన్న దశలు /
కలిమిలేముల విడువక కలసి మెలగి /
యుండు వారెపో మిత్రులీ యుర్విలోన
మిత్రులందరికి శుభాకాంక్షలు