28, అక్టోబర్ 2024, సోమవారం

 పాపము పోస్టు మేను 


a946463b-6067-46b8-824b-2a0b49bf9599.jpeg



తే. 

ఒకరి వార్త లింకొకరికి ఓర్పు తోడ 

ఎండ వానయనెడి భేద మేమి లేక 

ఉత్తరాలనందించెడి ఉత్తముండు 

పుడమి లోని నలువపట్టి 'పోస్టు మేను ' .


*నలువ పట్టి = నారదుడు .


తే . 

మూట కట్టిన జాబులు మోసికొనుచు /

పేట పేటకు తిరుగుచు పేరు పిలిచి /

జాబు లందించుచుండెడి జంత్ర గాడు /

పోస్టు మేను కదా మన పుడమియందు .


జంత్ర గాడు =machine వంటి వాడు 


తే. 

వార్తతో లేదు వీనికి బంధమెపుడు /

అశుభ మా శుభమా యను ద్యాస లేదు /

వార్త చేరవేయుటయందు కర్త యితడు /

అతడె పోస్టుమేను జగతి నరసి చూడ .


తే. 

చదువు రాని వారికి తానె జాబు చదివి /

బంధుల కబురులు తెలుపు బంధువతడు /

వారొసఁగు దానితో తృప్తి పడెడి వాడు /

'పోస్టుమేను' కనుమరుగై పోయె నేడు .


డా. కోరా 27/10/2024