
రాణాప్రతాప్
సీ.
సూర్య వంశజలధి సోముఁ డు రాజపుత్రారణ్య భయద హర్యక్ష మతఁడు /
మొగలాయి శాత్రవ ముదితల ముఖకమలములనేచెడి కాళ రాత్రి యతఁడు /
భారతక్షత్రీయ పౌరుషాగ్నుల పర రాజుల మండించు రాచ కొలిమి /
రాజపుత్రుల రణ ప్రావీణ్యమున్ తేట తెల్లము జేసిన ధీరుఁ డతఁడు /
ఆ.వె
ఆఱడుగులమించు నాజాను బాహుఁడు/
వెడద యురముతోడ వెలయు వాఁడు /
ఖడ్గ కుంత ఖేటక యుతుఁడు రాణా ప్ర/
తాప వీర వరుఁడు రూప మరుఁడు .
-కోమలరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి