25, జులై 2021, ఆదివారం

 


వ్యాసుడు / కుప్పా  వేంకట కృష్ణమూర్తి -24/7/2021


సీ


విజ్ఞాన గోళాన్ని విలువైన నిలువైన వ్యాస రేఖా దీప్తి వ్యాస మౌని /

విజ్ఞాన రాశిని వివిధతన్ విపులతన్ పరచి యిచ్చిన దాత వ్యాస మౌని /

విజ్ఞాన సస్యముల్ విపుల భారత భూమి పనసలోదెలఁబంచె వ్యాసమౌని /

విజ్ఞాన కేంద్రముల్  వెదకి దేశంబెల్ల ప్రమ్మె విద్యా నేత వ్యాసమౌని //


తే.గీ 

భవ్య విజ్ఞానమనెడి రూపాయి బిళ్ళ/

కెన యు బొరుసుయు బొమ్మయు యెవ్వరౌదు/

రట్టి వ్యాసుని కృష్ణునవ్యాజ భక్తి /

మ్రొక్కు డీ వ్యాసపూర్ణిమఁ బూర్ణతకయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి