22, డిసెంబర్ 2017, శుక్రవారం

పద్యసౌందర్యము

అయ్యలరాజు రామభద్రుడు

తే.గీ.

రాయల భువన విజయాన రాణ కెక్కి/
రహిని రామాభ్యుదయ కృతి రచన చేసి/
నట్టి రామభద్ర సుకవిఁ నిట్టలముగ/
నామతింతును నామది నేమముగను.

ఇట్టలము=అధికము,మిక్కిలి, అతిశయము

20/5/19


రామకృష్ణ (లింగ) కవి.
తే. గీ.
ఉద్భటచరితమొకవంక పుండరీక/
చరిత మరొకవంక ఘటికాచల కృతియొక/
వంక రచన చేసిన శైవ వైష్ణవకవి/
రామలింగ ని నామది నామతింతు

(రామకృష్ణ కవిని మది నామతింతు)

సూరన కవి
తే.
కావ్యమందొక యర్థము గనుట లెస్స/
పరగఁ రెండర్థముల కృతులరుదు గాదె/
రామభారతార్థయుతమ్ము గా మలచిన/
కవిని సూరనార్యు మదిని గణన సేతు.


డా. కోమలరావు బారువ. 13/5/19

నంది తిమ్మన /కోమలరావు

గీ.
సత్య పుష్పము కోరగా శౌరి తెచ్చె/
పారిజాతమున్ మక్కువ మీర భువికి /
సరసులుభళీ యనఁగఁతాఁరచనను చేసెఁ/
నరణపుఁగవి తత్పుష్పాప హరణ కథను .

దైవ సృష్టి.       

      

 ఉప్పును సృజించితివి నీ/

వప్పుల , సహకార తరువు నవనిన్ గరిమన్ 

 గొప్పగ రెంటిని తగ నే /

ర్పొప్పన్  గల్పితివి నిన్ను పొగడన్ తరమే.      


-కోమలరావు 


నేటి తల్లి దండ్రుల దుస్థితి

తే . బిడ్డ పుట్టి నపుడె విత్తు నాటె నొకడు

      విత్తు పెరిగి పెద్ద విటపి యయ్యె

       కొడుకు పెరిగి తాను కోటీశ్వరుండయ్యె

       కొడుకు విడువ చెట్టు గూడు నిచ్చె 


(నేటి తల్లి దండ్రుల దుస్థుతి )

మల్లె పూవు.

తే. గీ

మనుజు మనసు మంచిదయిన మల్లె యండ్రు
పడతి రదముల సరిపోలు ప్రసవమీవు
కవుల కల్పనకు మధుర కావ్య మీవు
మగువలకు మక్కువలు గూర్చు మల్లె   పూవ!

కోమలరావు బారువ

సనకసనందాదులు
తే.గీ
బ్రహ్మ మానస పుత్త్రులై ప్రభవమంది/
బాల మునులు బ్రహ్మ జ్ఞాన పరత సత్వ/
చిత్తులై వనికి తపము   చేయ చనిరి/
బాలకులె చూడ సనకాది భవ్య మునులు?//

కోమలరావు 

భరత మాత

తే.గీ

మంచు మల చూడ అల శిరోమణిగ వెలుగ/
జహ్నుతనయ గౌతమి నెఱి జడలు గాగ/
జడనిధులుమొలనూలుగా నడుము వెలుగ/
పరిఢవిల్లును భువనైక భరత మాత.

డా.కోమలరావు బారువ ( 12/3/2018 )
వ్యాసుడు

తే.గీ



పల్లె పడుచుకు పాపడై ప్రభవ మంది

వేదములు నాల్గు వేర్వేర విశద పరచి

భారత ఫల మందించిన బాదరాయ

ణార్య చేకొను వేవేల నతులు మావి


--------

భావి ప్రజలు అల్ప మతులటంచు మదిని

తలచి భార తాఖ్య మఁ బటు కలము నొసఁగి

పెక్కు బాము ల తరియింప పెంపు మీర

ప్రజల బ్రోచిన శుక తాత సుజన వినుత


 భావి జనులల్పులంచుసత్ప్ర
తిభ మదిని

తలచి భారతమున పటు కలము నిలిపి

పెక్కు బాములతరియించి పెంపు మీర

ప్రజల బ్రోచిన శుక తాత! సుజన వినుత!


డా. కోమలరావు బారువ 

సీసం

పంచమవేదమౌభారతాఖ్యానాన నాయికా రమణియై నలరె నెవరు/

నరవరు భేదిత మత్స్య యంత్ర ఫలమై పాండుపుత్త్రుల పట్ట మహిషి యెవరు/

 ద్వాదశ వత్సర వనవాసమందున పతుల వెన్నంటిన   పడతి యెవరు/

అజ్ఞాత సమయాన అసదృశ బలుఁడగు ఖలు కీచకనిధన కారణ యగు/

తే. గీ

సుగుణరాశిగా యాజ్ఞసేనిగ వరలుచు/
ల/

కృష్ణు గాదిలి చెల్లెలౌ కృష్ణ నామ/

ద్వాపరయుగసాధ్వీమణి ద్రౌపది సతి


డా.కోమలరావు బారువ -- 25/12/17


పంచమ వేదమని పిలువబడే
రత్న కథలో నాయికగా ప్రసిద్ధి చెందిన ఆమె,
అర్జునుచేత కొట్టబడిన మత్స్య యంత్రము ఫలితంగా దొరికి పాండవు లందరుకు భార్య యైన ఆమె,
వనవాస జీవితంలో భర్తలను అనుసరించిన ఆమె,
అఙ్ఞాత కాలంలో అసమాన బలసంపన్నుడైన కీచకుని మరణానికి కారణమైన ఆమె,
యఙ్ఞకుండంలో పుట్టి యాఙ్ఞసేనిగా పిలువ బడిన ఆమె , కుంతీదేవి గారాబు కోడలు, కృష్ణనికి ప్రియమైన చెల్లెలు కృష్ణ అని పేరు కలిగిన ఆమె ద్వాపరయుగంలో ఉన్న సాధ్వీ మణి ద్రౌపది.
నరుడు= అర్జునుడు,
కృష్ణ= నల్లగా ఉన్నది.


సీసం

పంచమవేదమౌభారతాఖ్యానాన నాయికా రమణియై నలరె నెవరు/

నరవరు భేదిత మత్స్య యంత్ర ఫలమై పాండుపుత్త్రుల పట్ట మహిషి యెవరు/

 ద్వాదశ వత్సర వనవాసమందున పతుల వెన్నంటిన   పడతి యెవరు/

అజ్ఞాత సమయాన అసదృశ బలుఁడగు ఖలు కీచకనిధన కారణ యగు/

తే. గీ

సుగుణరాశిగా యాజ్ఞసేనిగ వరలుచు/
ల/

కృష్ణు గాదిలి చెల్లెలౌ కృష్ణ నామ/

ద్వాపరయుగసాధ్వీమణి ద్రౌపది సతి


డా.కోమలరావు బారువ -- 25/12/17


పంచమ వేదమని పిలువబడే
రత్న కథలో నాయికగా ప్రసిద్ధి చెందిన ఆమె,
అర్జునుచేత కొట్టబడిన మత్స్య యంత్రము ఫలితంగా దొరికి పాండవు లందరుకు భార్య యైన ఆమె,
వనవాస జీవితంలో భర్తలను అనుసరించిన ఆమె,
అఙ్ఞాత కాలంలో అసమాన బలసంపన్నుడైన కీచకుని మరణానికి కారణమైన ఆమె,
యఙ్ఞకుండంలో పుట్టి యాఙ్ఞసేనిగా పిలువ బడిన ఆమె , కుంతీదేవి గారాబు కోడలు, కృష్ణనికి ప్రియమైన చెల్లెలు కృష్ణ అని పేరు కలిగిన ఆమె ద్వాపరయుగంలో ఉన్న సాధ్వీ మణి ద్రౌపది.
నరుడు= అర్జునుడు,
కృష్ణ= నల్లగా ఉన్నది.


అనసూయ

తే.గీ

అత్రి మౌనికి భార్యయై అలరెఁ నెవరు/
నలువ ఫణిహారు శ్రీనాథు మాత యయ్యె/
సూనుల బడసె మువ్వుర సూరి నుతుల
యతివ లందసమానమై యలరె సతిగ
(ఆది వర్ణములు కలుప యామె యౌను.)


యశోద

తే.గీ
కరుణ మాలి వెన్నుని రోట కట్టె నెవతె/
చోద్యముగ నోట విశ్వము చూచె నెవతె/
కనక పోయిన కృష్ణుని కన్న తల్లి/
యయ్యె, నయ్యశోదకు భక్తి యంజలింతు.


27/11/17

గంగాదేవి
తే.గీ.
విష్ణు పదముల జనియించి వినుతి కెక్కి/
శివుని శిరముపై లీలగా చిందులేసి/
సగరు మనుమని తపసుకు సాక్షి కాగ/
అఘము లన్నియు పోగొట్టు " నభ్ర గంగ".

డా. కోమలరావు బారువ.13/11/2017


సతి అరుంధతి

తేటగీతి

నలువ మానస పుత్రియై తొలుత పుట్టి/
ముని వశిష్ఠుని మగనిగ పొంద గోరి/
జన్నమందున మరల తాఁ జనన మంది/
చుక్క గములలోతాఁ నొక చుక్కయయ్యి/
సాథ్వియై 'అరుంధతి' వెల్గె సతుల లోన.


సంధ్య అను పేర బ్రహ్మచేత సృష్టించబడి ,తండ్రి సోదరులకు మోహము కలిగించి తాను కూడ కొంత మోహపడి సిగ్గుతో తనువు చాలించ నెంచి వనములకు పోయెను. అప్పుడు బ్రహ్మ కూడ తన చపలత్వమునకు సిగ్గు పడి వశిష్టుని పంపి సంధ్య కు మంత్రోపదేశము చేయించెను.
ఆమె శివునికై తపస్సు చెసి మేథాతిథి యజ్ఞ కుండములోనుంచి పుట్టి ,
వశిష్టుని చేపట్టి ఆకాశంలో అరుంధతీ నక్షత్రమై నిలిచింది. - శివపురాణం/ ముదిగొండ నాగవీరేశ్వర కవి


అగస్త్యుడు 
మిన్ను నంటు వింధ్య వెన్ను విరుగగొట్టె/
పొలసుదిండి యుగము పొలియజేసె/
నబ్ది జలమునంత నాపోశనము బట్టె/
పొట్టియైన నేమి గట్టి వాడు //  


నట్టి ముని అగస్త్యుని భక్తి నంజలింతు .



విశ్వామిత్రుడు


సీసము
రాజసమ్మున ముని రాజు చే గోవుకై భంగ పడిన రాజ పాలకుండు

మునిముద్రలను వీడి మోహాం
బుధిన్ తేలి ఆ శకుంతల తండ్రియెవడు

సృష్టికి ప్రతి సృష్టి సృజియించి సప్తర్షి గణములోమిక్కిలి గణ్యు డెవడు

బ్రహ్మర్షి కానెంచిబహువర్షముల్ తపియించి బ్రహ్మర్షి యై నెవడు నెగడె

తే.గీ

కుశిక వంశ   సంజాతుడై కూర్మికెక్కి /

గాధి పట్టియై గాధేయు గణన గాంచి/ 

విశ్వ 'మిత్రుడె'  వాడెపో విశ్వమునకు/

లోక కళ్యాణమాశించు శ్లోకు డతడు //


అత్రి మహర్షి

బ్రహ్మ మానస పుత్త్రుడై ప్రబలు వాడు/
అతివ అనసూయ సాథ్విని సతిగ పొంది/
సోమ దుర్వాస దత్తులన్ సుతుల బడసి/
సప్త ఋషులలో మాన్యుఁడు తపసి అత్రి//

ప్రబలుట= వర్ధిల్లు,అతిశయించు

డా.కోమలరావు బారువ   4/9/17


గౌతముడు 


కరుణ తో నెవ్వఁడు భువికి గంగఁ దింపె /

గంగ యెవని పేర వనిలో "గౌతమయ్యె "/

క్షామ పీడిత మౌనుల క్షుదను బాపె /

నాతఁ డు కరుణా సాంద్రుఁడు గౌతముండు //

-------------------------

1.గౌతముడు అహల్యతో కలిసి శతశృంగ గిరి సమీపంలో ఆశ్రమమునిర్మించుకొని నివసిస్తుండే వాడు.

అతనికి బ్రహ్మ వరం ప్రభావం వలన ఆశ్రమము చుట్టూసస్యశ్యామలం గా యుండేది.

( విత్తు నాటినజాములో ఫలితం వచ్చేటట్టు ) .ఆ కాలంలోఒకప్పుడు కరువు విలయ తాండవం

చేయగా ప్రజలు, మునులు గౌతమ ముని ఆశ్రమములో ఆకలితీర్చుకున్నారు .

గోహత్యా పాతకం వదిలించుకోవడానికి శివునికై తపస్సుచేసి గంగను భూమికి దింపెను .గౌతముని కారణం గా భూమికి వచ్చిన గంగ గౌతమి గాప్రసిద్ధి చెందెను .

 ఆధారం.
మహర్షుల చరిత్రలు (గద్యం) - బులుసు వేంకటేశ్వరులు
మొదటి భాగం        తి.తి.దే ముద్రణ
88-97 పుటలు

వశిష్ఠుడు

సీ.

కన్యను కొమరుగా కనికట్టు వలె తన మంత్ర మహిమచేత మార్చె నెవడు/

 రాజస తామస సాత్విక గుణములఁసాత్విక శీలుడౌ సాధు వెవడు/

 నిమిరాజవాక్కుతోనిర్గత   దేహుడై మగిడి
    మైత్రావరుణుడయిన మౌని ఎవడు/

తరణి తనయయైన తపతి శిష్యునకుఁను
ద్వహమొనర్చినయట్టి మహితు డెవడు//

తే.

వాని ప్రస్తుతిఁ సేతు నా మానసమున/
బ్రహ్మ మానస పుత్రుని బ్రహ్మ మునిని/
రాము గురువైన మునివరు రమ్య చరితు/
సాధు చరిత (శీల) అరుంధతీ సతి కళత్రు//


డా.కోమలరావు బారువ 31/7/17

భక్త రామదాసు

ఆటవెలది

అప్పు చేసి కట్టె గొప్పగా నొకగుడి /
రాము మీది మిగుల ప్రేమ తోడ/
భక్త రామదాసు భద్రాద్రి యందున/
బంది యయ్యె దాని ఫలితముగను//


నారదుడు

సీసం

జగములోని జనులు జగడాల మారిగ ఏమౌనిని మిగుల ఏవ గింత్రు/

లోకకల్యాణమే లోనెంచ కలహభోజనుడంచును తనను జనులు పిలువ/

నారాయణా యంచు నామాలు పాడుచు వీణపైమీటునేజాణ మౌని/

ఈలోక మాలోక మేలోకమని యెంచకెల్ల లోకాలలో కలయ తిరుగు/

ఆ.వె.

నారదముని వరుని నాక లోకహితుని/
శారదాభ్ర రుచిర సార గాత్రు/
భక్త లోక మాన్యు భక్తాగ్రగణ్యు
ని/
పరమ హర్షి కొలుతు భక్తితోడ.//


డా.కోమలరావు బారువ -24/7/17

సారస్వత జ్యోత్స్న

హంస తేరు నెక్కి హాయిగా తిరిగేటి/
పద్మ భవుని రాణి పద్మ పాణి/
కావ్య,గాన కళల కాణాచి గీర్వాణి/
మమ్ముఁ గాచుఁ నక్ష పాణి 'వాణి'//

Komi 

వాల్మీకి

ఆ.వె

పుట్ట లోన పుట్టె పుణ్యాత్ము డొక్కడు/
వామలూరు డనఁగ వఱలు నట్లు/
వాని నోటి నుండి వచ్చె ' రామాయణం '/
ధరణి జనుల ముక్తి దాయకంబు //

డా.కోమలరావు బారువ 


వేణువు

ఆ.వె.

చిన్న గాయమైన చింతింత్రు మనుజులు/
కాయమందు పెక్కు గాయములట/
రసమధురములైన రాగాలు పలుకు నీ/
 కతన శౌరి "వంశి" ఖ్యాతిగాంచె


డా.కోమలరావు బారువ

( మాష్టారు గారి సవరణలతో)

తాళ్ల పాకను జనన మందిన

తకిట తద్ధిమి తకిట తద్ధిమి

తాళ మేసిన మేటి గాయక


విష్ణు నందక మె నీ వందురు

విష్ణు భక్తుల మేటి వందురు



కీర్తనలెన్నో వ్రాసినావట

కీర్తి దిగంతములన్ నిండగ


'బ్రహ్మ 'మొకటని చెప్పి నాడవు

బ్రహ్మ పదమును పొంది నాడవు


పదము పదమున మధువు లొలికిన
కలియుగాన పదకవి నీవే
కవివి నీవే పద కవివి నీవే

కలి యుగమ్మున పద కవి నీవయ్య

కవివి నీవయ్య పద కవివి నీవయ్య



అన్నమయ్య 

సింహాచల క్షేత్రం


భక్తుఁడగు ప్రహ్లాదుని 

యుక్తిన్ బ్రోచిన నరహరి ఉజ్జ్వలమూర్తీ

భక్తుల మము ముక్తికి అభి

షిక్తుల చేయన్ వెలసిన సింహాద్రీశా


-కోమలరావు బారువ 


 పానకమ్ము గ్రోలిపాపంబులనుద్రోలి/
మంగళాద్రి వెలసి మహిత శీల/
నమితభక్తునరయునారసింహ స్వామి
కరుణనోము మమ్ము కమల నయన!

అన్నవర క్షేత్రం


 తే.గీ
రత్నగిరిపైనిసత్యనారాయణునికి/
పంపఅభిషేకజలములపంపుచుండ/
జనులకోర్కెలదీర్పంగచతురుడగుచు
అన్నవరమున కొలువుండెఆత్మ బంధు!/

దమయంతి

తేటగీతి

మేరు నగధీరు మోహనా కారు నలుని/
చెట్ట పట్టి ఆ సురల ఛీ కొట్టి నట్టి/
సాధ్వి  దమయంతి సుమగాత్రి సతుల మేలు /
బంతి భైమిని వేనోళ్ళ ప్రస్తుతింతు.

చెట్ట= చేయి
భైమి= భీముని పుత్రిక

కోమలరావు బారువ- 18/12/17 .

అగ్ని

ఆ.వె . అరణి యందు పుట్టె ఆగమాలప్పుడు

          నిప్పు రాళ్ళలోన  నేడు పుట్టె

         మనికియేది యైన మసిచేయుటే కదా

          ఎప్పుడైన నిజము నిప్పు గాదే





నన్నయ భట్టు
 తే.గీ
 రాజ రాజయశము సుస్థి ర మ్ము చేయ/
 రమ్యముగ భారతమ్ము ను రచన చేసి /
 ఆది కవియనఁతెల్గున అలరు వాని/
 నన్నయ కవిని మనసార నతులు సేతు. ----------- డా. కోమలరావు బారువ

29/2019

తిక్కన కవి
  తే. మనుమ సిద్ధి యెవని మామ యనియెఁబేర్మి/
 భారతమెవని కలములో పరిఢవిల్లె/
  రామ కథ నెవడు రహిఁ నిర్వచన సేసె/
 నట్టి తిక్క యజ్వను నెమ్మనమునఁ దలఁతు.

 4/2/2019 


ఎఱ్ఱాప్రెగడ

రాణ కెక్కగ హరివంశ రచన చేసి/
భారతారణ్య శేషము భక్తి వ్రాసి/
శంభు దాసు బిరుదు గొనె శంభుఁ గొలిచి/
ఎఱ్ఱనార్యుడు భువినెంత వినుత యశుఁడు.

11/2/2019


నన్నెచోడుడు

గీ.

దేశి కవితకు ఆద్యుఁడై నెగడు వాఁడు/
మార్గ కవితను రచనలో మరువ కుండ/
క్రౌంచభేదను సంభవ కావ్య కర్త/
ఘనుఁడు నన్నెచోడకవిని వినుతి సేతు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి